నాపై తప్పుడు వార్తలు రాసేవాళ్లకీ..??

వాస్తవం ప్రతినిధి: అనుష్క‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవి అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈ భామ అంత పాపుల‌ర్. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన ఈ భామ, ‘భాగమతి’ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ. ప్రస్తుతం బరువు తగ్గి ‘నిశ్శబ్దం’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. అయితే అందరి హీరోయిన్స్ మాదిరే అనుష్కపై కూడా బోలెడు రూమర్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్వీటీ పెళ్లిపై అనేక పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న పుకార్లు, వ్యక్తిగత విషయాలపై స్వీటీ పెదవి విప్పారు. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై మొదటి నుంచి ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.. సినిమా వాళ్లపై పుకార్లు రావడం సర్వసాధారణం అయితే.. వాటి స్థాయి మరీ ఎక్కువగా ఉంటుంది. ఏమీ లేకుండానే పుకార్లు పుట్టిస్తున్నారు.. మేం కూడా వాళ్లలాగే మనుషులం అనే విషయాన్ని గుర్తించుకోవాలి కదా.. నాపై తప్పుడు వార్తలు రాసేవాళ్లకీ అక్కా చెల్లెల్లు ఉంటారు కదా.. అనుకుని వాటి గురించి ఆలోచించడం మానేశా’ అంటూ అనుష్క తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై అనుష్క మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని నేను చెప్పను. కానీ అదృష్టవశాత్తూ నేను ఎప్పుడూ దీన్ని ఎదుర్కోలేదు. నేను ఎప్పుడూ ముక్కుసూటిగా, స్పష్టంగా ఉంటాను. చిత్ర పరిశ్రమలో సులభ మార్గాల ద్వారా రాణించాలా.. లేదా కష్టపడి నిలదొక్కుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి’ అని సూచించారు.