ఐపీఎల్‌ నిర్వహించవద్దని కోరుతూ కోర్టులో పిటిషన్‌!!

వాస్తవం ప్రతినిధి : మార్చి 29న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2020పై ఒకింత సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్-19) సెగ ఐపీఎల్‌కు తాకడమే అందుకు కారణం. కరోనా భారత్‌లో కూడా వేగంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 60పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో.. ఐపీఎల్‌ను నిర్వహించవద్దని మద్రాసు హైకోర్టులో న్యాయవాది జి అలెక్స్‌ బెంజిగర్‌ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎంఎం సుంద్రేశ్‌, కృష్ణన్‌ రామస్వామి డివిజన్ బెంచ్‌ గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.దీంతో ఐపీఎల్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.