సద్గురు జగ్గీవాస్‌దేవ్‌కు ధన్యవాదాలు తెలిపిన ఏబీ డివిలియర్స్‌

వాస్తవం ప్రతినిధి : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ఇటీవల ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్‌తో సంభాషించాడు. దక్షిణాఫ్రికాపై సద్గురు అభిప్రాయమేంటో ఏబీ అడిగి తెలుసుకున్నాడు. భారత అభిమానుల సమక్షంలో ఏబీ అడిగిన ప్రశ్నలకు సద్గురు సమాధానాలిచ్చారు. ఆయన జవాబులకు ఏబీ ఫిదా అయ్యాడు. ‘భారతదేశంలోని ఓ అద్భుత వ్యక్తితో సంభాషించా’ అని సోమవారం ఏబీ ట్వీట్‌ చేశాడు.

‘భారత్‌లోని ఓ అద్భుత వ్యక్తితో సంభాషించా. మా దేశం, మా ఖండం గురించి మంచి సందేశం ఇచ్చిన సద్గురు జగ్గీవాస్‌దేవ్‌కు ధన్యవాదాలు. మా అందరికీ మీరు ప్రేరణగా నిలిచారు. ఏప్రిల్‌ 4న మిమ్మల్ని ఆహ్వానించేందుకు దక్షిణాఫ్రికా ఎదురుచూస్తోంది. గెలిచేందుకు చెప్పిన సూచనకు కృతజ్ఞతలు’ అని ఏబీ ట్వీట్‌ చేశాడు. ‘ఏబీ.. ఆఫ్రికా వచ్చేందుకు నేనెంతగానో ఎదురుచూస్తున్నా. సహజ వనరులు, అద్భుత అవకాశాలు, సుసంపన్నమైన చరిత్ర ఉన్న ఖండం ఆఫ్రికా. మీ సాదర స్వాగతానికి ధన్యవాదాలు’ అని సద్గురు రీట్వీట్‌ చేశారు.