వైసీపీ అరాచకం: ప్రాణ భయంతో పరుగులు తీసిన.. బుద్ధా వెంకన్న, బోండా ఉమ..??

వాస్తవం ప్రతినిధి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు దాడులు చేసుకునేదాకా వెళ్ళాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు అడ్డుకుంటున్న వైసీపీ వర్గీయులు.. ఇప్పుడు నేరుగా దాడులకు తెగబడుతున్నారు. నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై దాడికి పాల్పడ్డారు వైసీపీ కార్యకర్తలు. కార్లను అడ్డగించి.. వైఎస్సార్‌సీపీ వర్గీయులు కర్రలతో అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమ వెంటపడ్డారని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ దాడిలో కొందరికి గాయాలు అయ్యాయన్నారు. తాము ప్రాణ భయంతో కారులో బయల్దేరి వెళుతుండగా.. దారి మధ్యలో డీఎస్పీ శ్రీహరిబాబు తమకు భద్రత కల్పించారని.. కానీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు డీఎస్పీపైనా దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల సహాయంతో తాము క్షేమంగా బయటపడ్డామని చెప్పారు. దాడి అనంతరం ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లామని అక్కడ ఎవరూ లేరని చెప్పారు.