ధోనీ మాటలకు అందరు ఫిదా..!!

వాస్తవం ప్రతినిధి: 2019 ప్రపంచ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇప్పటివరకు ధోని ఎలాంటి మ్యాచ్ లో ఆడలేదు. అయితే ఈ విరామ సమయం లో ధోని ఇండియన్ ఆర్మీ కి సేవలు అందించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ కోసం పలు జట్లు పోటీ పడుతూనే ఉంటాయి. ఈసారి కూడా చెన్నై జట్టు ఫేవరేట్ అని చెప్పాలి. మార్చి 29 నుండి మొదలు కానున్న ఈ ఐపీఎల్ కోసం ధోని ట్రైనింగ్ కోసం చెన్నై విచ్చేసారు. చెన్నై చేరుకున్న ధోనీ సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు. ఈ సందర్భంగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ.. “చెన్నైసూపర్ కింగ్స్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. 2008లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో నా ప్రయాణం మొదలైంది. నేను ఒక క్రికెటర్‌గా మరింత మెరుగవడానికి ఎంతో సహాయపడింది. క్రికెటర్‌గా, ఒక వ్యక్తిగా అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనప్పడు చెన్నై ఫ్రాంచైజీ నాకు అండగా నిలిచింది” అని చెప్పుకొచ్చారు.