లవర్ ను.. జిప్‌కు తాళం వేసి.. ఛీ..ఛీ మరి ఈ విధంగా నా..??

వాస్తవం ప్రతినిధి: తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆట పట్టిద్దామనుకున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తన బాయ్‌ఫ్రెండ్‌ను సరదాగా ఆట పట్టిద్దామనుకొన్న ఒక మహిళ కటకటాలపాలైన ఘటన ఫ్లోరిడా నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సారా బూన్‌ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్ టోర్రెస్ జూనియర్‌తో కలిసి ఫ్లోరిడా నగరంలో నివసిస్తున్నారు. ఇంట్లో వీరిద్దరు సరదాగా మద్యం సేవించి, అనంతరం హైడ్‌ అండ్‌ సీక్‌ పేరుతో సారా బూన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ను సూట్‌కేసులో పెట్టి జిప్‌కు తాళం వేసింది. “ఈ సూట్‌కేసులో ఎక్కువ సేపు ఉండలేను.. ప్లీజ్‌ నన్ను బయటికి రానివ్వు” అని కేకలు పెట్టి సహాయం కావాలని ఏడుస్తున్నా పట్టించుకోలేదు గర్ల్ ఫ్రెండ్. దీంతో రాత్రంతా సూట్‌కేసులోనే ఉండిపోవడంతో జార్జ్‌ ఊపిరాడక చనిపోయాడు. తర్వాతి రోజు ఉదయం సూట్ కేస్ ఓపెన్ చేసేసరికి స్పందన లేకుండా పడి ఉన్న జార్జ్‌ ను చూసి షాక్ అయ్యింది. బూనె తన బాయ్ ఫ్రెండ్(టోరెస్) చనిపోయాడంటూ శవాన్ని తీసుకువెళ్లి పోలిసులకు సమాచారం ఇచ్చింది. బూనె స్టేట్‌మెంట్ల ఆధారంగా అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీడియోల్లో సూట్‌కేసులో నుంచి బయటికి వచ్చేందుకు టోరెస్ ప్రయత్నించినట్లు,కాని ఆమె గట్టిగా నవ్వుతూ.. నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలానే అనిపించింది అని అరిచినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. బూన్‌ కావాలనే జార్జ్‌ను చంపిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.