ఎదో అనుకుంటే..ఇంకేదో జరిగింది..అంతా విధి..!!

 వాస్తవం ప్రతినిధి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) దేశం షార్జాలోని ఏఓజీఎం కంపెనీ యజమాని బిచానా ఎత్తివేయడంతో 16 మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. షార్జాలో కేరళకు చెందిన వ్యక్తి కంపెనీ ఏర్పాటు చేసి భవన నిర్మాణ పనులు కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 16 మందితో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా ఈ కంపెనీలో పనిచేయడానికి వీసాలు పొందారు. కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ ఆరు నెలల నుంచి కంపెనీ యజమాని కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బు కోసం ఇంటికి వెళుతున్నా అని చెప్పి.. యజమాని తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లిపోయాడు. కంపెనీ యజమాని వస్తాడు మాకు జీతాలు ఇస్తారు అని ఆశతో కార్మికులు మూడు నెలల పాటు కంపెనీ క్యాంపులోనే ఉండిపోయారు. అయినా యజమాని నుంచి స్పందన లేకపోవడంతో, తాము మోసపోయ్యాం అని తెలుసుకుని.. సొంత ఖర్చులతోనే కార్మికులు ఇంటికి చేరుకున్నారు. ఎంతో ఆశగా నాలుగు రుపాయిలు సంపాదించుకుంటాం అని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కి వెళ్లితే.. సంపాదించుకోకపోగా ఉన్న డబ్బులు కూడ అయిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.