నెలల పసికందుకు నాలుగు ఆపరేషన్‌లు..!!

వాస్తవం ప్రతినిధి: గత కొన్ని సంవత్సరాల క్రితం భారత్‌ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లి, అక్కడ ఓ సంస్థలో పని చేస్తున్న వాసుదేవన్..శ్రుతి అనే యువతిని పెళ్లాడి తనతోపాటు గల్ఫ్‌కు తీసుకెళ్లాడు. పెళ్లై ఏళ్లు గడిచినా ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు. పిల్లలను ఎత్తుకునే అదృష్టం తమకు లేదనుకుని సరిపెట్టుకునే క్రమంలో.. ఆ దంపతులకు ఓ పండంటి అబ్బాయి పుట్టాడు. ఆ బాబు పేరు అతర్వ్ అయితే అబ్బాయి పుట్టాడని సంతోషించేలోపే.. వారికి ఓ చేదు నిజం తెలిసింది. అతర్వ్ పుట్టుకతోనే.. ప్రాణాంతక సమస్యలతో పుట్టాడు. దీంతో అతని కన్ను, మెదడు, పొట్టకు డాక్టర్లు దాదాపు నాలుగు ఆపరేషన్‌లు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వాసుదేవన్.. “నెలల పసికందుకు ఇప్పటికే నాలుగు ఆపరేషన్‌లు అయ్యాయి. ఆసుపత్రి బిల్లు ఇప్పటికే దాదాపు మూడున్నర కోట్లు అయింది. ఇంట్లో సంపాదించే వ్యక్తిని నేనొక్కన్నే. ఆసుపత్రి బిల్లు చెల్లించడం కోసం కొంత డబ్బును సర్దుబాటు చేశా, అయినప్పటికీ ఇంకా డబ్బు కావాలి. స్వచ్ఛంద సంస్థలు.. దాతల ఆర్థిక సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాము” అని తెలిపారు