ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా నేను పాకిస్తాన్ వెళ్లనంటే వెళ్లను..!!

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్‌లో క్రికెట్‌ ఆడటం ఏమీ ప్రమాదం కాదని చెప్పడం కోసమే బంగ్లాదేశ్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు ఒప్పందం చేసుకున్న తరుణంలో.. ఇక ఏకైక వన్డేతో పాటు మరో టెస్టు మ్యాచ్‌ మిగిలిఉన్న నేపధ్యంలో.. పాకిస్తాన్‌ పర్యటనపై ముష్ఫికర్‌ను బీసీబీ సంప్రదించింది. దీనిని ముష్ఫికర్‌ వినమ్రంగా తిరస్కరించాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌ పర్యటనకు తాను వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పాడు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా తాను పాకిస్తాన్‌లో పర్యటించే బంగ్లాదేశ్‌ జట్టులో సభ్యుడిని కాబోనంటూ స్పష్టం చేశాడు. “ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందులో వెనుకడగు వేసే ప్రసక్తే లేదు. నేను పాక్‌ పర్యటనకు వెళ్లనని ఇప్పటికే చెప్పా. దాన్ని బీసీబీ పెద్దలు కూడా అంగీకరించారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా పాక్‌కు వెళ్లను” అని తేల్చి చెప్పాడు.