టీమిండియాకు బిగ్ షాక్..??

వాస్తవం ప్రతినిధి: న్యూజిలాండ్ పై రెండో టెస్టు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన టీమిండియాకు మరో సమస్య వచ్చినట్లే కనబడుతోంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముంగిట భారత జట్టుకి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఇప్పటికే యువ ఓపెనర్ పృథ్వీ షా గాయంతో రెండో టెస్టులో ఆడటంపై అనుమానాలు నెలకొనగా.. తాజాగా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా గాయపడ్డాడు. తొలి టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన పేసర్‌ ఇషాంత్‌ శర్మ.. రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయం మళ్లీ తిరగబెట్టడంతో ఇషాంత్‌.. టీమిండియాప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరు కాలేదు. దాంతో ఇషాంత్‌ రెండో టెస్టులో ఆడటంపై సందేహాలు ఏర్పడ్డాయి. క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ఉదయం 4 గంటల నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఇషాంత్ శర్మ కాలి మడమకి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో.. కనీసం నెల రోజులు క్రికెట్‌కి దూరంగా ఈ పేసర్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇషాంత్ శర్మ గాయపడటం భారత్ విజయావకాశాల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇషాంత్ శర్మ స్థానంలో రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ లేదా నవదీప్ సైనీ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. రెండో టెస్టు మ్యాచుకు ఇషాంత్ దూరం కావడం భారత్ కు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. రెండో టెస్టు మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తున్న భారత్ కు ఇది తీవ్రమైన ఎదురు దెబ్బ.