కేక పుట్టిస్తున్న నితిన్.. కలెక్షన్ల కుమ్ముడే కుమ్ముడు..!!

వాస్తవం ప్రతినిధి: నితీన్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తాజాగా తెర్కెక్కించిన చిత్రం భీష్మ. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 21వ తేదిన విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ని సంపాదించుకుని కలెక్షన్ల పరంగా మంచి వసూళ్ళను రాబడుతుంది. సంక్రాంతి తరువాత వచ్చిన సినిమాలలో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను భీష్మ నిలబెట్టిందనే చెప్పాలి. నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద భీష్మ కలెక్షన్ల కుమ్ముడు కొనసాగిస్తోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 21) విడుదలైన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో నితిన్ కెరియర్‌లోను అత్యధిక వసూళ్లను రాబడుతోంది. తొలిరోజు ఆరున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.10 కోట్లు.. నాలుగు రోజుల్లో రూ. 16.71 కోట్ల షేర్ రాబట్టింది. ఇక తొలివారం ముగిసేనాటికి ఆక్యుపెన్సీ పెంచుకుని వరల్డ్ వైడ్ రూ.50 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఏదేమైనా నితిన్‌కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి.