జగన్ కు బిగ్ షాక్.. ఆయన మృతి..!

వాస్తవం ప్రతినిధి: సీఎం చిన్ననాటి స్నేహితుడు మృత్యువాతపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం మృత్యువాత పడేలా చేసింది.  జగన్ తో కలిసి దిగిన ఫోటోలను, పాదయాత్రలో జగన్ తో కలసి తీయించుకున్న ఫోటోలని ఫ్లెక్సీల్లో పెట్టించి తన ఇంటిముందు కట్టే ప్రయత్నంలోనే తనతో పాటుగా మరొక అభిమాని విద్యుదాఘాతం తో మృత్యువాత పడ్డారు. వివరాలోకివెళ్లితే.. విశాఖపట్నంలోని అనకాపల్లికి చెందిన ఏడిద జగదీష్(39), ముప్పిడి శ్రీను(42)లు వైసీపీ అభిమానులు. అంతేకాకుండా జగదీష్ తన చిన్నప్పుడు జగన్‌తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆయన మీద అభిమానంతో అప్పట్లో దిగిన ఫోటోలను, పాదయాత్రలో పాల్గొన్న చిత్రాలను కలిపి ఓ భారీ ఫ్లెక్సీగా తయారు చేయించి తన ఇంటి ముందు పెట్టాలనుకున్నారు. ఫ్లెక్సీని ఇంటి ముందు కట్టడం కోసం గురువారం డాబా మీదకు ఎక్కారు. ఇందుకోసం ఆయన దూరపు బంధువైన ముప్పిడి శ్రీను అనే వ్యక్తం సాయం కోరారు. ఇద్దరూ ఫ్లెక్సీ కడుతుండగా.. ఒక్కసారిగా గాలి వీయడంతో అది ఇంటి ముందున్న హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. హైటెన్షన్ వైర్ల నుంచి విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరికీ కరెంట్ షాక్ తగిలింది. ఇద్దర్నీ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా జగదీష్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. శ్రీను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ అనుహ్య పరిణామంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.