“హిట్” మూవీ రివ్యూ-

రేటింగ్: 2.5/5

మూవీ నేమ్ : హిట్.

నటీనటులు: విశ్వక్ సేన్, రుహాని శర్మ తదితరులు.

డైరెక్టర్: శైలేష్ కొలను

మ్యూజిక్ డైరెక్టర్: వివేక్ సాగర్

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28, 2020.

ఇంట్రడక్షన్:

టాలీవుడ్ ఇండస్ట్రీ నాచురల్ స్టార్ నాని నిర్మాణ రంగంలో అడుగుపెట్టి అ! అనే విభిన్నమైన స్టోరీ కలిగిన సినిమాని నిర్మించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘హిట్’ అనే సినిమాని నిర్మించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫలక్ నూమా దాస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. రుహాని శర్మ హీరోయిన్ గా నటించింది. కాగా సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకులను బాగా అలరించింది. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్ తో సినిమాని నిలబెట్టాడు డైరెక్టర్. డైరెక్టర్ పనితనం చూసుకుంటే సినిమాలో ఎక్కడా కూడా ప్రేక్షకుల అంచనాల మేరకు కాకుండా ట్విస్ట్ మీద ట్విస్టులు సన్నివేశాలు ఉండేలా డైరెక్టర్ శైలేష్ కొలను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ వరకు సస్పెన్స్ బాగా కొనసాగించాడు. హీరో విశ్వక్ సేన్ యాక్టింగ్ సినిమాకి హైలెట్ అని ప్రేక్షకులు అంటున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ కు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే ‘హిట్’ సినిమాకి ఫస్ట్ డే అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది.

స్టోరీ:

స్టోరీ విషయానికొస్తే సినిమాలో ప్రీతి అనే అమ్మాయి కనిపించకుండా పోవడం ఆమె కనిపించటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటం జరుగుతుంది. ఇది ఒక మిస్టరీ కేసు గా చాలామంది ఆఫీసర్లను టెన్షన్ పాటించడంతో ఇటువంటి కేసులలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా బాగా అనుభవం ఉన్న విశ్వక్ సేన్ కి డిపార్ట్మెంట్ అప్ప చెప్పడం జరుగుతుంది. సినిమాలో విశ్వక్ సేన్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు పాత్రలో నటించడం జరుగుతుంది. కాగా ఈ సినిమాలో మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో తన లవర్ కూడా కిడ్నాప్ కావటం హీరో విశ్వక్ సేన్ కి ట్విస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అప్పటి నుండి సినిమా చాలా టెన్షన్ గా క్లైమాక్స్ వరకు ట్విస్ట్ మీద ట్విస్టులతో నడుస్తోంది. మరి ప్రీతి అనే అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు ఇదే సమయంలో విశ్వక్ సేన్ లవర్ హీరోయిన్ నేహా (రుహాని శర్మ) ఎందుకు కిడ్నాప్ అవుతుంది అన్నది సినిమా చూస్తే బాగుంటుంది.

పాజిటివ్ పాయింట్స్:

సినిమా స్టోరీ.

థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు.

విశ్వక్ సేన్ యాక్టింగ్.

సెకండాఫ్.

నెగెటివ్ పాయింట్స్:

సినిమా ఫస్టాఫ్.

అక్కడక్కడ సాగదీసే సన్నివేశాలు.

టెక్నికల్ గా:

మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. 100% వివేక్ సాగర్ ఈ సినిమాకి న్యాయం చేశాడు. కెమెరా పనితనం పెద్దగా ఏమీ లేదు. ఎడిటింగ్ విషయంలో కాస్త సినిమా యూనిట్ జాగ్రత్త తీసుకొని ఉంటె కొంచెం బాగుండేది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

రిజల్ట్ :

న్యాచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ రెండో సినిమా హిట్…ప్రేక్షకులను బాగానే అలరించింది అనే టాక్ ప్రస్తుతం ఉంది. ముఖ్యంగా చిన్న హీరోలలో విశ్వక్ సేన్ ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను అద్భుతంగా తెరకెక్కించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దర్శకుడి పనితనం సెకండాఫ్ లో సినిమా చూసే ప్రేక్షకులను కుర్చీకి టెన్షన్ తో కట్టిపరేసింది. సమ్మర్ సీజన్ ముందు విడుదలైన హిట్ సినిమా….స్టోరీ పరంగా, హీరో యాక్షన్ పరంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సమ్మర్ సీజన్ ముందు విడుదలైన ఈ సినిమా కచ్చితంగా చూడదగ్గ సినిమా అని అంటున్నారు ఆడియెన్స్.

                                                                                          …పాంచజన్య