రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం..!!

వాస్తవం ప్రతినిధి: రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటినుండో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నా ఈ సంగతి అందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే అసెంబ్లీ సీట్ల పెంపు ఇలాంటివి లేదని ఓ క్లారిటీ రావడం జరిగింది. విషయంలోకి వెళితే విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇంకా అనేక విషయాలలో క్లారిటీ లేని వాతావరణం ఉన్న తరుణంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా అసెంబ్లీ సీట్ల పెంపు జరిగినప్పుడే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ చట్టం ప్రకారం.. ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ సీట్లను పెంచడానికి అవకాశం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన సమయంలో అప్పటి ప్రభుత్వం.. విభజన చట్టంలో ఇష్టారీతిన అనేక అంశాలు పెట్టారన్నారు. రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై న్యాయ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బట్టి చూస్తే ఇప్పుడు అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేదన్నట్టు గానే ఉంది.