మళ్ళీ పర్యటిస్తా..ఎన్ని సార్లు ఆపుతారో చూస్తా..

వాస్తవం ప్రతినిధి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటనను నిన్న పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విశాఖ విమానాశ్రయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధంలో ఉంచారు. ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబును   విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో పంపించేశారు.

నిన్నటి విశాఖ పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని సార్లు ఆపగలుగుతారో చూస్తానని మండిపడ్డారు.విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్నానానికి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసుల సహకారం లేకుండా వైసీపీ కార్యకర్తలు ఎలా విమానాశ్రయానికి రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసుల సాయంతోననే వైసీపీ నిరసనలు అనేది స్పష్టం అయిందని అభిప్రాయపడ్డారు.