అమిత్ షా తో మూడు రాష్ట్రాల సీఎం ల భేటీ

వాస్తవం ప్రతినిధి: భువనేశ్వర్‌లో ఇవాళ ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఆ సమావేశానికి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పాటు మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హాజరయ్యారు. సీఎం పట్నాయక్ తన నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్‌లో అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన అల్లర్ల పట్ల మమతా స్పందించారు. ఆ ఘటనలు కలిచివేశాయన్నారు. అలా జరిగి ఉండాల్సి కాదన్నారు. పోలీసు అధికారితో పాటు ఓ ఐబీ ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. బాధిత కుటుంబాలకు సాయం చేయాలన్నారు. అమిత్ షా రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ సరైంది కాదు అని, ప్రస్తుతం సమస్యను పరిష్కరించాలన్నారు. రాజకీయ చర్చలు తర్వాత చేపట్టాలని బెనర్జీ అన్నారు.