అమెరికాలో ఘొర రోడ్డు ప్రమాదం.. ఎన్నారై దంపతులు మృతి..!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. మృతులు ఆవుల దివ్య, రాజా గవిని గా పోలీసులు గుర్తించారు. దంపతులతో పాటు ప్రేమ్‌నాథ్ రామనాథం అనే వ్యక్తి కూడా మరణించాడు. డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ముషీరాబాద్‌ గాంధీనగర్‌ లో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అయితే వీరికి ప్రేమనాథ్ రామనాథం స్నేహితుడని తెలుస్తుండగా అతని స్వస్థలం లాంటి వివారాలు ఇంకా తెలియలేదు. దివ్య, రాజా దంపతులకు ఆరేళ్ల కూతురు ఉంది. కాగా వీరి మృతదేహాలను త్వరగా హైదరాబాద్ కు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు మంత్రి కేటీఆర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.