ఎయిర్ పోర్టులో సేమ్ ఎన్టీఆర్ లా వ్యవహరించిన మహేష్ బాబు..!!

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో ఇండస్ట్రీలో మంచి జోరు మీద ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. చాలావరకు రియల్ లైఫ్ లో ఎక్కువగా ఆర్భాటాలకు వెళ్ళకుండా తన పని తాను చేసుకుంటూ చాలా రిసర్వ్ డ్ గా మహేష్ బాబు ఉంటాడు. అదే సమయంలో చాలా కొంటెగా కూడా జోకులు వేస్తుంటాడు. సినిమా సెట్లలో ఇంకా కొన్ని కొన్ని సినిమా ప్రమోషన్లలో కామెడీ పంచులు వేసే మహేష్ బాబు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒక్కోసారి ఆ విధంగానే వ్యవహరిస్తారు. తాజాగా ఇటీవల మహేష్ ఎయిర్ పోర్ట్ కి వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మహేష్ కారు దిగి ఎయిర్ పోర్ట్ లోకి వెళుతున్నంత సేపు అక్కడున్న ఓ ఫోటో గ్రాఫర్ మహేష్ ని ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు. మహేష్ కు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ మహేష్ సహనం కోల్పోకుండా ఫోటో గ్రాఫర్ పై కామెడీ పంచ్ లు వేశాడు. ‘ఆపమ్మా ఆపు.. ఎప్పుడూ ఇదే పనా.. బోర్ కొట్టట్లేదా నీకు’ అని ప్రశ్నించాడు. దీనితో అక్కడున్న సిబ్బంది అంతా నవ్వుల్లో మునిగి తేలారు. ఈ వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా గతంలో ఈ విధంగానే ఎయిర్ పోర్టులో సేమ్ ఎన్టీఆర్ కూడా ఫోటోగ్రాఫర్ పై జోకులు వేస్తూ భయంకరమైన పంచులు వేశాడు. దీంతో మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ వీడియో పై నెటిజన్లు చాలామంది సేమ్ ఎన్టీఆర్ లో మహేష్ వ్యవహరించారని కామెంట్ చేస్తున్నారు.