మహేష్ బాబు తో గొడవలు అంటూ వచ్చిన వార్తలు గురించి క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్..!!

వాస్తవం సినిమా: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయాల గురించి మరియు అదే విధంగా సినిమాల గురించి అనేక విశేషాలను తెలియజేశారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో గొడవలు ఉన్నట్లు అందువల్లనే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానట్టు వచ్చిన వార్తల గురించి ప్రకాష్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే…మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి.. ఇటీవలే కదా.. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించా.. బ్రహ్మాండంగా ఆ సినిమా ఆడింది అని ప్రకాష్ రాజ్ అన్నారు.నేను ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి హాజరు కాను. అంతెందుకు సినిమాలు కూడా పెద్దగా చూడను. సరిలేరు నీకెవ్వరు కూడా ఇంతవరకు నేను చూడలేదు. అంతమాత్రాన మహేష్ తో విభేదాలు ఉన్నట్లా అని ప్రకాష్ రాజ్ అన్నారు. మహేష్ బాబు బంగారం అని అన్నారు.