యాంకర్ ప్రదీప్ కి సలహా ఇచ్చిన కాజల్ అగర్వాల్..!!

వాస్తవం సినిమా: టెలివిజన్ రంగంలో యాంకరింగ్ లో దూసుకు పోతున్నాడు ప్రదీప్ మాచిరాజు. ప్రముఖ టీవీ షోలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ ఇటీవల సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రదీప్ హీరోగా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ పాల్గొనడం జరిగింది. సినిమా గురించి అనేక విషయాలు మాట్లాడినా ప్రదీప్ ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగా. ప్రదీప్ తాను కాజల్‌కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. అయితే కాజల్ నిన్ను డేటింగ్‌కి రమ్మని అడిగితే ఏం చేస్తావు అని అడగగా ప్రదీప్ నేను ముందు కళ్ళు తిరిగి పడిపోతానని, ఆ తరువాత గిచ్చుకుని ఇది నిజం కాదని అనుకుంటానని అన్నారు. ఒకవేళ నిజంగానే కాజల్ అలా అడిగితే నో మేడమ్ నాతో జోకులు వేయకండని చెబుతానని అన్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో ప్రదీప్ ఆన్సర్లపై రియాక్ట్ అయిన కాజల్ ఇలాంటి కఠినమైన ప్రశ్నకు కాస్త క్రియేటివ్ ఆన్సర్ ఆలోచించు ప్రదీప్ అని సలహా ఇస్తూ, నీ సినిమాకు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు.