త్రివిక్రమ్ సినిమాలో సమంత..??

వాస్తవం సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా తో త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. దీంతో నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు ప్రకటించిన త్రివిక్రమ్ ఆ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్న త్రివిక్రమ్ ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మిక మందన ని తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా రష్మిక ప్లేస్ రిప్లేస్ చేస్తూ స్టార్ హీరోయిన్ సమంతాని త్రివిక్రమ్ తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. త్రివిక్రమ్‌ గత సినిమాలు ‘అత్తారింటికి దారేది’, ‘సన్ అఫ్ సత్యమూర్తి’, ‘అఆ’ ల్లో సమంత నటించిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తో ఈ భామ బృందావనం , రామయ్య వస్తావయ్యా, రభస, జనతాగ్యారేజ్ సినిమాల్లో జతకట్టింది. కాగా ఈ సినిమాలో సమంత ఎంపిక పై అధికార ప్రకటన మాత్రం రాలేదు.