నితిన్ సినిమాలో అనసూయ..??

వాస్తవం సినిమా: వరస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ ‘భీష్మ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే నెక్స్ట్ సినిమాని లైన్ లో పెట్టేసాడు నితిన్. విషయంలోకి వెళితే బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘అంధదూన్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో తెలుగు టెలివిజన్ రంగంలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ చాన్స్ దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ‘అంధదూన్’ రీమేక్ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. హిందీ సినిమాలో ‘టబు’ చాలా కీలకమైన పాత్రను పోషించింది. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై అనసూయకి విపరీతమైన క్రేజ్ వుంది. ఈ పాత్రలో అనసూయ అయితే సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్ భావిస్తున్నట్లు సమాచారం.