అమరావతిలో ట్రంప్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పులేదు అని శాసనసభ లో ఎప్పుడైతే సీఎం జగన్ చెప్పడం జరిగిందొ.. అప్పటి నుండి అమరావతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులు మరియు ఆ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల విభేదిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఇటు పోలీసుల ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో రైతులు తమకు తోచిన విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఏపీలో గత 69 రోజులకు పైగా రైతుల ఉద్యమం కొనసాగుతోంది. కాని జగన్ సర్కార్ మాత్రం దీని పై ఏం స్పందించక పొగా, రాజధానిని తరలించే ప్రయత్నాలు మూమ్మరంగా చేస్తున్నారు. ఓట్లు అడగడానికి మా గుమ్మం తొక్కిన వైసీపీ నేతలు మేము కష్టాలో ఉంటే కనీసం పలకరింపు లేదని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ట్రంప్ పర్యటన ముగియనుంది.. ఢిల్లీ నుంచి ఆయను అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతారు. ఇదిలా ఉంటే ట్రంప్ టూర్ ఎఫెక్ట్ రాజధాని అమరావతిపై పడింది. అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులు వినూత్నంగా నిరసనను తెలియజేశారు. మంగళవారం ట్రంప్ ఫోటోలతో నిరసనలు తెలియజేశారు. అమెరికాకు ఒకటే రాజధాని, ఇక్కడ సీఎం జగన్ మాత్రం మూడు రాజధానులు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారని, రైతులు, మహిళలు ట్రంఫ్ ప్లకార్డులతో ప్లీజ్ ట్రంప్.. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తూ..ట్రంప్‌కు తమ ఆవేదనను చెప్పుకుంటున్నాము అంటున్నారు రైతులు.