టీడీపీ కి ఏమైంది..?? ఎందుకు ఇలా మాట్లాడుతుంది..? మౌనం అర్ధాంగీకారమే గా..??

వాస్తవం ప్రతినిధి: ఏపి రాజకీయాల్లో ట్వీటర్ వార్ నడుస్తుంది. టిడిపీ, వైసీపీ ల మధ్య మాటలు తూటాలుల పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అన్నట్లుగా ఉంటుంది. ఒకరినొకరు తిట్టుకోవడంలో, ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపడంలో ఎవరు ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎప్పుడు ట్వీటర్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రతి రోజూ ఏదో ఒక్క పోస్ట్ చేస్తూనే ఉంటారు. అందులో ముఖ్యంగా బుద్ధా వెంకన్న భళే జోరు మీద ఉన్నట్లు తెలుస్తుంది. రోజు ఎదో ఒక్క ట్వీట్ చేసి వైసీపీ కి కౌంటర్ లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి తనదైన శైలిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద విరుచుకుపడ్డారు. అచ్చన్న మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. ఈఎస్ఐ వ్యవహారంలో తన పాత్ర లేదు కాబట్టే అచ్చెన్న దైర్యంగా మీడియా ముందుకు వచ్చి సవాల్ విసిరారని, 43 వేల కోట్లు కొట్టేసింది జగన్ గారే కాబట్టి మీడియా ముందుకు రావడానికి భయపడి చాటుగా ఉంటున్నారని తనదైన శైలిలో బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. మౌనమే 43 వేల కోట్ల స్కామ్ కి అంగీకారం విజయ సాయి రెడ్డి గారు అంటూ పార్టీలో A2 పదవి ఇవ్వకపోతే రాసిన దొంగ లెక్కలు బయటపెడతా అని జగన్ గారిని బెదిరించి పదవులు కొట్టేసిన మీలా అందరూ ఉంటారు అనుకుంటే ఎలా విజయసాయి రెడ్డి గారు అని అన్నారు. 6 లక్షల కోట్లు కుంభకోణం అని జగన్ గారు పుస్తకం రాయించారు. ఆ పుస్తకంలో ఉన్న 6 లక్షల కోట్లు వెతకడానికి తమిళనాడులోని కుంభకోణం వెళ్లి తప్పిపోయాడు విజయసాయి రెడ్డి గారు అని అన్నారు. బుద్ధా వెంకన్న మాటలకు టీడీపీ అభిమానులు “జై” కొట్టారు. టీడీపీ జోరు పెంచిందని, అసలు టీడీపీకి ఈ మధ్య ఏమైంది..?? టీడీపీ ఈ విధంగా మాట్లాడుతుందని అనుకోలేదని.. ఇలా స్పీడ్ పెంచి, వరుస ట్వీట్స్ తో జగన్ కి ఝలక్ ఇస్తున్నారు అని చెప్పుకుంటున్నారట.