అప్పుడే లీక్ అయిపోయిన ఫోటో.. కొరటాల – చిరంజీవి అలర్ట్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ సినిమాలకు లీకుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇప్పటికే అనేక లీకుల ఎఫెక్ట్ తగిలాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి ఏదో ఒక ఫోటో గాని వీడియో గాని ఇంటర్నెట్లో లీక్ అవుతూనే ఉన్నాయి. ఇదే తరహాలో కొరటాల మరియు చిరంజీవి సినిమాలకు లీక్ ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇటువంటి తరుణంలో తాజాగా చిరంజీవి మెడలో ఎర్ర కండువా వేసుకొని నక్సలైట్ గా కనిపిస్తున్న ఓ ఫోటో వచ్చి ఇదే ఈ సినిమాలో చిరంజీవి లుక్ అని ప్రచారం జరుగుతుంది. ఆ ఫోటోను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.దేవాదాయ శాఖ భూకుంభకోణానికి సంబంధించిన కథతో వస్తున్న ఈ సినిమాలో మెగా స్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఓ పాత్ర లుక్ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో వెంటనే కొరటాల మరియు చిరంజీవి అలర్ట్ అయినట్లు సినిమా షూటింగ్ సమయంలో ఎవ్వరు కూడా సెల్ ఫోన్ ఉపయోగించకూడదు అనే కొత్త రూల్ పాస్ చేసినట్లు సమాచారం.