భీష్మ- రివ్యూ :

రేటింగ్: 2.75/5

నటీనటులు:

హీరో హీరోయిన్లు : నితిన్, రష్మిక మందన. 

డైరెక్టర్: వెంకీ కుడుముల.

మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వర సాగర.

ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశీ.

రిలీజ్ డేట్: 21-2-2020.

పరిచయం:

కుర్ర హీరో నితిన్ వరుస ఫ్లాపులతో గత కొంత కాలం నుండి సతమతమవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన “అఆ” సినిమా తర్వాత మరొక హిట్ కొట్టడం లేదు. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇటువంటి తరుణంలో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టడం కోసం తనకి కలిసివచ్చే కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ స్టోరీ కలిగిన ‘భీష్మ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 21వ తారీకు న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో పర్వాలేదనిపించింది.

స్టోరీ:

అనంత్ నాగ్ కి “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” ఉంటుంది. ఆ కంపెనీలో సీఈఓ పదవిలో అనంతనాగ్ వ్యవహరిస్తూ వ్యవసాయ రంగానికి మంచి చేయాలనే ఆలోచన భావనతో తన కంపెనీ ద్వారా సరికొత్త పద్ధతులను కనిపెట్టడానికి ఎప్పటికప్పుడు ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటాడు . ఇదే సమయంలో మరో పక్క అనంతనాగ్ “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” కి వ్యతిరేకంగా క్రిమినల్ మైండ్ మరియు కార్పొరేట్ స్థాయిలో ఆలోచిస్తూ కంపెనీ హెడ్ అయిన రాఘవన్(జిష్షు) ప్రతి విషయంలో పోటీ పడుతూ అడ్డుపడుతుంటాడు. ఇటువంటి సమయంలో గమ్యం లేకుండా అల్లరి చిల్లరిగా అమ్మాయిల వెంట తిరుగుతూ భీష్మ(నితిన్)..రష్మిక మందన నిచూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల వల్ల నితిన్ “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” కి మేనేజర్ అవుతాడు. అలా మేనేజర్ అయ్యాక నితిన్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? క్రిమినల్ మైండ్ కలిగిన జిష్షు ఏ విధంగా ఆట పట్టించాడు ఎలా ఆపగలిగాడు? అసలు కంపెనీ బాధ్యతలు నితిన్ చేపట్టాల్సిన అవసరం మరియు కారణం ఎందుకు వచ్చింది..? అది తెలియాలంటే ఈ సినిమా హాల్ లో చూడాల్సిందే.

విశ్లేషణ: 

“అఆ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత యంగ్ హీరో నితిన్ కి సరైన హిట్ పడలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం వరుస ఫ్లాపులతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో ఇటువంటి సమయంలో చలో అనే మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల చెప్పిన భీష్మ స్టోరీ విని చాలా టైమ్ తీసుకుని ఈ సినిమా చేశాడు నితిన్. అయితే సినిమా స్టార్టింగ్ మొదలైన సందర్భంలో సినిమాపై పెద్దగా అంచనాలు ఎవరికీ లేదు. కానీ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ మరియు పాటలు ఎప్పుడైతే విడుదల అయ్యాయో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

అయితే భీష్మ సినిమా విషయానికొస్తే సినిమాకి సంబంధించి స్టోరీ థీమ్ ట్రైలర్ లోనే చూపించాడు డైరెక్టర్. దీంతో సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని డైరెక్షన్ బాగుంటుందని వెళ్లే వాళ్ళకి మాత్రం కొద్దిగా నిరాశ ఎదురవుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ సినిమాని చాలా స్లోగా తీసుకెళ్ళాడు డైరెక్టర్. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి…ఫస్టాఫ్ కి పూర్తి భిన్నంగా యాక్షన్ సన్నివేశాలు కామెడీతో అద్భుతంగా స్టోరీ ని లాక్కొచ్చాడు. సినిమా పోట పోటీగా సెకండాఫ్ కామెడీ సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో ఆడియన్స్ ఫుల్ ఎంటర్ టైన్ అవుతున్నారు. సెకండాఫ్ సినిమా చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా నితిన్ మరియు వెన్నెలకిషోర్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అదేవిధంగా రష్మిక మందన మరియు నితిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కించాడు వెంకీ కుడుముల. ఇదే విధంగా ఎమోషనల్ ఎపిసోడ్స్ విషయంలో అనంతనాగ్ మరియు నితిన్ ల మధ్య వచ్చే సీన్ సినిమాకే హైలెట్ గా ఉంటాయి.

చివరిగా:

ఇండస్ట్రీలో నితిన్ కి బ్యాడ్ టైం నడుస్తుంది అని అనుకుంటున్న తరుణంలో భీష్మ సినిమా తో అదిరిపోయే విజయాన్ని సాధించారు. చాలా డీసెంట్ గా మరియు క్లాసిక్ స్టోరీ నేపథ్యంలో మాస్ టచ్ మరియు ఫ్లేవర్ కలిగి క్యారెక్టర్ నటుడిగా నితిన్ సినిమాలో తనలో ఉన్న కొత్త యాంగిల్ని అద్భుతంగా వెండి తెరపై చూపించాడు. డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా నితిన్ ని సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. క్లాసిక్ మరియు డీసెంట్ గా ఉన్న ఈ సినిమా కామెడీ ఎక్కువగా ఉండటంతో ఈ వీకెండ్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘భీష్మ’ సినిమా కి మంచి కలెక్షన్లు రావచ్చు.

పాజిటివ్ పాయింట్స్:

నితిన్ మరియు రష్మికాల మధ్య కెమిస్ట్రీ

నితిన్,వెన్నెల కిషోర్ ల మధ్య కామెడీ

పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్

హిలేరియస్ కామెడీ ట్రాక్స్

నెగిటివ్ పాయింట్స్ :

కాస్త అంచనా వెయ్యగలిగే కథనం

అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం.

                                                                                    …పాంచజన్య