టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు పనికిరారు…నోరు జారిన నందమూరి కోడలు..!!

వాస్తవం ప్రతినిధి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీది పిచ్చి తుగ్లక్‌ యాత్ర అంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శించారు. వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. అబద్దాలు చెబుతూ ,చీ..ఛా అనిపించుకుంటూ బతకడం లో గొప్పదనం ఉందా? ఎందుకు ఈ అబద్దాల బతుకు అని, ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో చంద్రబాబుకు అర్దం కావడం లేదని అన్నారు. పోయే కాలం వచ్చినట్లు ఉందని జనం అనుకుంటున్నారని ఆమె అన్నారు. ఐటీ దాడుల్లో అక్రమాస్తులు బయటపడుతుంటే.. చంద్రబాబు, లోకేష్‌కు దిక్కుతోచడం లేదని , డిపాజిట్లు కూడా రావనే చంద్రబాబు ప్రచారానికి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాస్ట్రంలో కరువు తీరి పంటలు పండి సంతోషంగా ఉంటే చంద్రబాబు ద్వేషంతో 320 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అబద్దాలు ప్రచారం చేయడం దారుణంగా ఉందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన పలు స్కీమ్ లను అంతా మెచ్చుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని అన్నారు. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు పనికిరారని… సమర్థులైన వారిని ఎన్నుకోవాలని ఆ పార్టీ నేతలే సూచిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలన బాగుంటే అమరావతిలో ఎందుకు ఓడారు? అని ప్రశ్నించారు. ఐటి దాడులలో రెండువేల కోట్ల రూపాయలు బయటపడితే దాని గురించి మాట్లాడకుండా ఉండడానికి చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన సభలు జయప్రదం అయ్యాయని రాయడానికి ఓ పచ్చ మీడియా ఉంది. అది పచ్చ మీడియా కాదు పిచ్చిబట్టిన మీడియా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.