చంద్రబాబు కి నమ్మక ద్రోహం.. అడ్డంగా బుక్ చేసిన టీడీపీ ఎంపీ..!!

వాస్తవం ప్రతినిధి: సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వల్ల పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని, సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఒకవేళ ఈ తీర్మానాన్ని టీడీపీ అంగీకరించపోతే పార్టీకి రాజీనామా చేస్తానని గతంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని విజయవాడలో నిర్వహించిన సీఏఏ, ఎన్ఆర్‌సీ వ్యతిరేక ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్ దేశంలో ఒక మతం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని, సీఏఏ, ఎన్ఆర్సీ తీసుకొస్తున్నారని నాని మండిపడ్డారు. తాను భారతీయుణ్ణి అని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ లాంటి డాక్యుమెంట్లేవీ పనికి రావంటున్నారని ఆరోపించారు. తన తల్లి పౌరసత్వాన్ని తాను ఎలా నిరిపించుకోవాలని ఆయన ప్రశ్నించారు.

కేంద్రం తక్షణమే ఎన్ఆర్సీ, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. కేరళ తరహాలోనే ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లుకు బదులు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే తామేంతో సంతోషించేవాళ్లమని అన్నారు. సీఏఏను సవాల్ చేస్తూ జగన్ సర్కారు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్నారు.. లేదంటే తానే దాఖలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఇందుకు టీడీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలుకుతారని చెప్పారు. అయితే కేశినేని నాని చేసిన డిమాండ్‌‌తో‌ చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారిందనే చేప్పుకోవాలి. ఎందుకంటే..?? ఇప్పటికే సీఏఏ, ఎన్ఆర్సీకి జగన్ వ్యతిరేకం అని ప్రకటించారు. ఈ మేరకు అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది..అదే కనుక జరిగితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలకాల్సి ఉంటుంది. ఒక వేళ మద్దతు పలికితే..ఎక్కడ మోదీ, అమిత్ షాలు కన్నేర్ర చేస్తారో అనే భయ్యం చంద్రబాబును వెంటాడుతోంది. ఒక్కవేళ మద్దతు ఇవ్వకపోతే.. మైనారిటీ ఓటు బ్యాంక్ గోవిందా అవుతాయి. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. ఇది విన్న టీడీపీ శ్రేణులు..ఒక పక్క ప్రత్యర్థి పార్టీ వైసీపీ పై విమర్శలు చేస్తూనే..మరో పక్క ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే అడ్డంగా ఇరికించేశాడుగా అని మాట్లాడుకుంటున్నారు.