ఎన్డీయేలోకి వైసీపీ.. కన్నా ఏమన్నారంటే..!

వాస్తవం ప్రతినిది: ఏపీలో జగన్ ఢిల్లీ పర్యటనల నేపధ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది . మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధినేతలను కలిశారు జగన్ . మొన్న మోడీతో భేటీ అయ్యి వచ్చిన వెంటనే మళ్ళీ రెండు రోజులలో హస్తినకు వెళ్ళటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది . ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠకు కారణం అవుతుంది .

ఈ ప్రచారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఎన్డీఏలో వైసీపీ పార్టీ చేరడంపై తమకు సమాచారం లేదని కన్నా పేర్కొన్నారు. టిడిపి, వైసీపీలకు సమాన దూరంలో ఉండాలనేది బీజేపీ విధానమని తేల్చి చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ విషయం మా పార్టీ ఇంఛార్జులు ఇప్పటికే ప్రకటన చేశారని, మరి మంత్రి బొత్స ఎందుకలా మాట్లాడారో తెలియడం లేదని కన్నా అన్నారు. బొత్సా వ్యాఖ్యల వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ పరిపాలనా పరమైన అంశాలపై మాత్రమే ప్రధానితో, కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారని , ఈ భేటీలకు రాజకీయాలకు సంబంధం వుండి వుండదని కన్నా అభిప్రాయపడ్డారు.