రోడ్డు ప్రమాదం లో బ్రదర్ అనిల్ కుమార్‌కు స్పల్పగాయాలు

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బావ, చెల్లెలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్రదర్ అనిల్ కుమార్‌కు స్పల్పగాయాలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరం నుండి విజయవాడ సిటీకి ప్రయాణిస్తుండగా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారులో ఉన్న డ్రైవర్ తో సహా అతని గన్ మేన్ కి కూడా గాయాలయ్యాయి.

బ్రదర్ అనిల్‌కుమార్ కారుకు ప్రమాదం జరిగిందని తెలియగానే.. ప్రభుత్ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన బ్రదర్ అనిల్‌కుమార్, డ్రైవర్, గన్‌మెన్‌లను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు.