భారత్ పర్యటన నేపధ్యంలో ట్రంప్ ఆసక్తికర ట్వీట్!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 24, 25న తన సతీమణి మెలానియాతో కలిసి భారత్ లో పర్యటించనుండగా, ఈనేపథ్యంలో ట్రంప్‌ భారత్‌ పర్యటనపై ఉన్న ఆసక్తిని మరోసారి వ్యక్తపరిచారు.మరో రెండు వారాల్లో భారత పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటనను గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఫేస్‌బుక్‌లో జుకర్‌బెర్గ్ తనను నెం.1 గా, భారత ప్రధాని మోదీని నెం.2 గా పేర్కొనడంపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది జుకర్ తనకు ఇఛ్చిన గౌరవమని అన్నారు.

‘ఎస్.. నిజానికి నేను రెండువారాల్లో ఇండియాకు వెళ్తున్నాను..  Thnanks to Facebook: ఫేస్‌బుక్‌లో నాదే ఫస్ట్ ప్లేస్.. తర్వాత మోదీ.. థ్యాంక్స్ జుకర్‌బెర్గ్ !నా ఈ పర్యటన కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. జుకర్‌బెర్గ్‌ని అభినందించారు.