వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అవతారమెత్తిన మహీ

వాస్తవం ప్రతినిది: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే ప్రపంచకప్‌ సెమీస్ అనంతరం మైదానానికి దూరమైన విషయం తెలిసిందే.  సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే మహీ.. శుక్రవారం ఓ స్టన్నింగ్ ఫొటోతో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఓ పులి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. దానికి ‘పులిని ఫొటోలు తీయడానికి అది ఎక్కువ సమయం ఇవ్వదు. దొరికిన సమయంలోనే కెమెరాను క్లిక్‌మనిపించాలి. కన్హా పార్క్‌ను సందర్శించడం అద్భుతంగా ఉంది’అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ఫొటోగ్రాఫర్‌గా తాను తీసిన ఫొటోనని మహీ చెప్పకనే చెప్పాడు.మధ్య ప్రదేశ్‌లోని ఈ కన్హా పార్క్‌ను జనవరిలో ధోని తన కుటుంబ సభ్యులతో సందర్శించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్క్‌ను అతను విజిట్ చేయడం ఇదే తొలిసారని ఆ పార్క్ వెబ్‌సైట్‌ పేర్కొంది. చార్డెడ్ ప్లేన్‌లో ధోని అక్కడు వెళ్లినట్లు సమాచారం.