ప్రగతి భవన్‌లో రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ

వాస్తవం ప్రతినిది: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్‌ సమావేశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.