న్యాయ శాఖామంత్రి తో జగన్ భేటీ..హైకోర్టు తరలింపుపై ప్రధాన చర్చ!

వాస్తవం ప్రతినిది: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. సరిగ్గా 12 గంటల సమయంలో రవిశంకర్ కార్యాలయంలో జగన్ తో సహా వైసీపీ ఎంపీలు ఆయనతో సమావేశం అయ్యారు. ముఖ్యంగా హైకోర్టు తరలింపుపై ప్రధానంగా చర్చ జరిగింది.

ఇక శుక్రవారం హోంమంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ దాదాపు 40 నిముషాలపాటు చర్చించారు. వీరి భేటీలో పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్‌ షాతో సీఎం జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాకారం కావాలని సీఎం జగన్‌ కోరినట్లు సమాచారం. కాగా రెండు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వివరించిన విషయం తెలిసిందే.