అధికారంలోకి రాగానే తగిన బుద్ది చెప్తాం ..పోలీసులపై కేఈ ఫైర్

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం ఏపీలో వైసీపీ టీడీపీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులముందు అనంతపురం రాజకీయాలలో కీలకనేత అయిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల పై ఒక రేంజ్ లో ఫైర్ అవ్వగా తాజాగా కర్నూల్ జిల్లాకి చెందిన మరో టీడీపీ నేత అదే స్థాయిలో మరోసారి ఫైర్ అయ్యారు. కేఈ ప్రభాకర్.. పోలీసులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడుతూ..

ఇప్పుడు లోపలికి వచ్చిన పోలీసులు.. టీడీపీ అధికారంలోకి వస్తే గేటు బయటే ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తామంటే ఏంటో చూపిస్తామని కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. ఇదే సమయంలో గత తొమ్మిదేళ్లుగా సారా వ్యాపారం చేస్తున్నవారిని ఎందుకు వదిలేశారని అధికారులని ప్రశ్నించారు.

గతంలో జేసీ దివాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తా అని వారిని కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఎస్పీ ఆ స్థాయి పైన అధికారులు గానీ కింది స్థాయి అధికారులు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని అలాంటివారందరికి టీడీపీ అధికారంలోకి రాగానే తగిన బుద్ది చెప్తాం అని అన్నారు.