కరోనా పై సింగపూర్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆనందంలో దేశ ప్రజలు..!!

వాస్తవం ప్రతినిధి: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అంతకంతకూ విజృంభిస్తున్నది. కరోనాతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,367కు చేరినట్లు చైనా జాతీయ వైద్య కమిషన్‌ వెల్లడించింది. అలాగే వైరస్‌ సోకిన వారి సంఖ్య 59,804కు పెరిగినట్లు తెలిపింది. తాజాగా కరోనా ఇప్పుడు సింగపూర్‌కు తాకింది. దీంతో సింగపూర్‌కు ఇతర దేశాల వారు వెళ్లడం లేదు. సింగపూర్‌లో 50 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ దేశ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు చికిత్సకు అయిన బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సింగపూర్ వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది. సింగపూర్ దేశంలోని పాలీక్లినిక్ లు, క్లినిక్ లు, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు చికిత్స చేయించుకుంటే వాటి బిల్లులన్నీ చెల్లించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు నిర్ణయంతో ఆ దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే చైనా దేశం తర్వాత ఈ కోవిడ్-19 వైరస్ సింగపూర్ లోనే ఎక్కువ మంది రోగులకు వచ్చింది. దీంతో ఈ నిర్ణయాన్ని సర్కారు ప్రకటించింది.