బ్రిటన్ ఆర్థికమంత్రిగా ‘ఇన్ఫోసిస్‌’ నారాయణమూర్తి అల్లుడు

వాస్తవం ప్రతినిధి: బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ నియమితులయ్యారు. బ్రిటన్‌ కేబినెట్‌లో చోటుచేసుకున్న భారీ మార్పుల్లో భాగంగా ప్రధాని తర్వాత రెండో స్థానంగా భావించే ఆర్థిక మంత్రి పోస్టు ఆయనకు దక్కింది. ప్రధాని జాన్సన్‌ చీఫ్‌ స్పెషల్‌ అడ్వైజర్‌ డొమినిక్‌ కమ్మింగ్స్‌తో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్థిక మంత్రి, పాక్‌ సంతతికి చెందిన సాజిద్‌ జావిద్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి రిషి సునక్ ను ఈ వ‌రించింది.

బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ని సౌతాంప్టన్‌లో నివాస‌ముంటున్న‌ రిషి సునక్ రిషి సునక్‌ తాత పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించారు. 1960 ప్రాంతంలో పంజాబ్ నుంచి యూనైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్(పీపీఈ) సునక్‌ చదువుకున్నారు. రాజకీయాల్లోకి ప్ర‌వేశించే ముందు ఆయ‌న అనేక బ్యాంకుల్లో పని చేశారు. 2009లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్నారు. నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి 2014లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా సునక్‌ బరిలోకి దిగిన సున‌క్ విజ‌యం అందుకున్నారు. థెరిసామే ప్రభుత్వంలో సైతం రిషి సునక్ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయ‌న యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ ఎంపీ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.