సుష్మా స్వరాజ్‌ సేవలకు గుర్తుగా కేంద్రం కీలక నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ గత మోదీ ప్రభుత్వంలో ఎన్నో సేవలను చేసింది. విదేశాల్లో చిక్కుకున్న వారిని విడిపించడం.. దౌత్యపరమైన వ్యవహారాల్లో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించే వారు. ఇలా ఎంతో మందితో ప్రశంసలు అందుకున్న ఆమె సేవలకు గుర్తుగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

శుక్రవారం ఆమె 68వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రం, ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు ఆమె పేరును పెట్టారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం విడుదల చేసింది. సుష్మ గౌరవార్థం ఈ రెండు ఇనిస్టిట్యూట్‌లకు ఆమె పేరు పెట్టినట్టు విదేశాంగ శాఖ తెలిపింది.కాగా సుష్మ గుండెపోటు కారణంగా గతేడాది ఆగస్టు 6న కన్నుమూశారు. ఆమె తొలి జయంతి సందర్భంగా ఈ విధంగా ఆమెపై గౌరవాన్ని చాటారు. సుష్మ చొరవతో విదేశాల్లో చిక్కుకొని సొంత గడ్డపై అడుగుపెట్టిన ఎంతో మంది ఆమె సేవలను గుర్తు చేసుకుంటున్నారు.