మళ్లీ నేడు ఢిల్లీకి సీఎం జగన్ !

వాస్తవం ప్రతినిధి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ ఢిల్లీకి చేరుకొనున్నారు. మొన్ననే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన ఏపీ సీఎం జగన్ మరోమారు హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్టు సమాచారం. అమిత్ షా ను కలిసి, పలు అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి సీ ఎం జగన్ ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం మధ్యాహ్నానికి సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

కాగా, ఈ నెల 12న జగన్‌ ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం ఈ భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.