దిస్ ఈజ్ వాస్తవం : లోకేష్

వాస్తవం ప్రతినిధి: ఏపిలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. టిడిపీ, వైసీపీ ల మధ్య మాటలు తూటాలుల పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అన్నట్లుగా ఉంటుంది. ఒకరినొకరు తిట్టుకోవడంలో, ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపడంలో ఎవరు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తాజాగా ఒక సూటి ప్రశ్న వేశారు. ప్రజా కోర్టులో జగన్ గారు ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారని ప్రశ్నిస్తూ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుగారి హయాంలో పోలవరానికి పునాది పడలేదన్నారు కదా మరీ ఇప్పుడు బాబుగారి హయాంలో 58 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారని “దిస్ ఈజ్ వాస్తవం” అంటూ లోకేశ్ ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.