‘వరల్డ్ ఫేమస్ లవర్’ -రివ్యూ

రేటింగ్: 2.75/5

నటీనటులు: విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెసా, రాశీ ఖన్నా, ఇజబెల్లా తదితరులు.

డైరెక్టర్: క్రాంతి మాధవ్.

నిర్మాత: కె.ఎస్.రామారావు.

మ్యూజిక్ డైరెక్టర్: గోపీసుందర్.

రిలీజ్ డేట్: 14-2-2020.

పరిచయం:

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ అయింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా కి మొదటిరోజు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తూ నలుగురు హీరోయిన్లతో ఆడి పాడటం జరిగింది. సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించారు. సినిమా స్టార్ట్ అయిన సమయంలో పెద్దగా హైప్ ఏమీ లేదు. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రమోషన్ సమయంలో చాలా తెలివిగా సినిమాకి సంబంధించి తక్కువ మాట్లాడారు విజయ్ దేవరకొండ. అయితే సరికొత్త లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు సినిమాపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న అనగా ఈ రోజు విడుదలైన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.

స్టోరీ:

లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు గౌతమ్(విజయ్ దేవరకొండ) యామిని(రాశి ఖన్నా). అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ ఒకటిన్నర సంవత్సరాలు గడుస్తాయి. చాలా రిచ్ అమ్మాయిగా యామిని ఉన్నాగాని…ఉద్యోగం లేని బాయ్ ఫ్రెండ్ కోసం ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ కలను రైటర్ అవ్వడం. గౌతమ్ కలను నెరవేర్చడం కోసం యామిని అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది. కాగా ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో యామిని తన జీవితం నుండి వెళ్లిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురౌతాడు గౌతం. ఇటువంటి పరిస్థితుల్లో ‘గౌతం వరల్డ్ ఫేమస్ లవర్’ అనే పుస్తకం రాయటం ప్రారంభిస్తాడు. అతడు రాసిన మూడు ప్రేమ కథలే ఈ సినిమా. ఒకపక్క పుస్తకం రాస్తుండగా మరోపక్క అదే పుస్తకంలో ఉన్న మూడు ప్రేమ కథలు తెరపై చూపించడం జరిగింది. గౌతమ్ రాసిన మూడు లవ్ స్టోరీలు శీనయ్య, సువర్ణల ఇల్లందులో ప్రేమ కథ, ప్యారిస్ లో గౌతమ్, ఇజాల మధ్య ప్రేమకథ. మరి చివరాఖరికి గౌతం రైటర్ గా సక్సెస్ అయ్యాడా లేదా…తిరిగి యామిని గౌతం జీవితంలోకి వచ్చిందా లేదా సినిమాలో ఏం జరిగిందన్నది వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

మూడు ప్రేమకథలు కలిగిన స్టోరీగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తెరకెక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులు విజయ్ దేవరకొండ యాక్టింగ్ కి ఫిదా అవ్వటం గ్యారెంటి. సినిమాలో తాను ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి ఎన్ని విధాల కష్టపడతాడు ప్యూర్ లవ్ ఎలా ఉంటుందో అద్భుతంగా చిత్రీకరించాడు తెరకెక్కించాడు క్రాంతి మాధవ్. గత సినిమాలకు భిన్నంగా చాలా అద్భుతంగా మరియు అర్థవంతంగా తెరకెక్కించాడు. నాలుగు ప్రేమ కథలను…ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో ఫస్టాఫ్ లో కొద్దిగా బోర్ అనిపించినా కానీ సెకండాఫ్ లో మాత్రం ప్రేక్షకులను బాగా ఎంటర్టైనర్ చేశారు. అయితే కథలో మరో కథ ఉండటంతో కొద్దిగా జనాలు రిసీవ్ చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారు. ముఖ్యంగా శీనయ్య, సువర్ణల ప్రేమకథ మనసును హత్తుకుంటుంది. ఇంటర్వెల్ సమయంలో ఎమోషన్స్ చాలా బాగుంటాయి. అదే విధంగా కూడా క్లైమాక్స్ అదరగొట్టింది.

ఓవరాల్ గా:

స్టోరీ పరంగా చూసుకుంటే డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ క్యారెక్టర్ స్క్రీన్ పై కనబడతాయి. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కథలో కథ ఉండటంతో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది స్టార్టింగ్ లో. సినిమాలో విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో చూపించారు. ఫస్టాఫ్ అదరగొట్టే స్థాయిలో ప్రేక్షకులను బాగా చూపించారు. వరుస ఫ్లాపుల తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా సినిమాపై ఎక్కువ హైప్ రాకుండా వ్యవహరించినా సినిమాకి మాత్రం అద్భుతంగా ఓపెనింగ్స్ వచ్చాయి. క్లైమాక్స్ లో ఎమోషనల్ పరంగా కూడా సినిమా చాలా బాగా ఉంది. అయితే ప్రేక్షకులకు ఎలా నచ్చుతుందో చూడాలి మరి..

సినిమాకి ప్లస్:

విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్

శీనయ్య, సువర్ణల పెర్ఫార్మన్స్

ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మన్స్

సినిమాకి మైనస్:

సినిమా స్టోరీ.

సెకండాఫ్.

సాంగ్స్.

టెక్నికల్ గా:

మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ చక్కని సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ సినిమాకి కొద్దిగా మైనస్ అని చెప్పవచ్చు.

………పాంచజన్య