ప్రేమ ప్రయాణం..

వాస్తవం ప్రతినిధి: ప్రేమ అనే పదం రెండు అక్షరాలే…పలకాలంటే రెండు క్షణాలు.. ఇది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో తెలియదు.. కానీ ప్రేమ లేనిదే జీవితం లేదు .. ప్రేమంటే ఏమిటంటే అది ప్రేమించినాకే తెలిస్తుంది.. ప్రేమ కు నిర్వచనాలు చెప్పమంటే శ్వాస , గుండె, మనసు.. జీవితం..సర్వస్వం అంటూ ఎన్నో అర్ధాలు బావాలను పుంకాలు పుంకాలు గా చెప్తారు… ప్రేమికుల కోసం ఒక రోజు కూడా ఉంది .. అది నేడే పిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్బంగా వాస్తవం స్పెషల్ స్టోరి..

ప్రపంచ ప్రేమికుల దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు వారి వారి బర్త్ డే జరుపుకోవడం సాంప్రదాయం..అలాగే సందర్బాలను బట్టి అనేక డేస్ జరుపుకుంటారు.ప్రేమికులు తప్పనిసరిగా జరుపుకునే వేడుక పిబ్రవరి 14. ప్రేమ అనే తెలుగు….లవ్ అనే ఇంగ్లీష్ ,ప్యార్ అనే హిందీ .. ఇష్క్ , కాదల్ ఏ బాషలో పలికినా ఏదైనా బావం ఒకటే… వారి మద్య ఉన్న బందం , అనుబంధం ఎఫెక్షన్ ను చాటి చెపుతుంది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా ఏర్పడుతుందో చెప్పలేము… నడవడిక చూసి కొందరికి… అందం ,ఆకర్షణ చూసి మరి కొందరికి. మనస్తత్వం చూసి ఇంకొందరికి ఇలా అనేక రకాలుగా ప్రేమ పుడుతుంది . ప్రేమ పుట్టడానికి ప్రత్యేకంగా ప్లేస్ అనేది లేదు క్లాస్ రూమ్ లో , ప్రయాణంలో , పనిచేసే చోట ఇలా ఎన్నో సందర్బాల్లో ప్రక్రియ .. కొంత మందికి తొలి చూపులోనే ప్రేమలో పడతారు. నేటి ప్రేమలకు అర్దాలు మారుతున్నాయి.. నూరు రూపాయల నోటు చూస్తే ప్రేమపుట్టే కాలంగా మారింది.. అవసరాల కోసం టైం పాస్ లవ్ గా మారింది. గాఢం గా ప్రేమించుకున్న వారు పెళ్లిళ్లు చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉంటున్నారు.. కొన్ని జంటలు మద్యలో విడిపోతున్నాయి.. పార్కులకు సినిమాలకే పరిమితవుతున్న ప్రేమలను తట్టుకోలేక మద్యలోనే జీవితాలు ముగుస్తున్నాయి. కొన్ని కొన్ని సందర్బాలలో పచ్చని కుటుంబాల్లోప్రేమచిచ్చు పెట్టి ఆర్పుతున్నాయి.. ప్రేమ కథల తో కొన్ని వందల సినిమాలు పాటలు తయారు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారంటే ప్రేమకున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోతుంది. ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికులు కలుసుకోవడం ..ఒకరికొకరు మరుపురాని గిప్టులను అందించుకోవడం ప్యాషన్ గా మారింది. పార్టీ పేరుతో ఈవెంట్లు నిర్వమించడం కల్చర్ గా మారింది.. సోషల్ మీడియా ద్వారా విష్ చేసుకోవడం ట్రెండ్ గా మారింది.. హ్యాపీ వాలంటైన్స్ డే జోష్ చేసారు. పాశ్చాత్య దేశాల పోకడ ను వ్యతిరేకించాలంటూ కొన్ని యువసంఘాలు ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నాయి.. జంటలు కన్పిస్తే పెళ్లిల్లు చేస్తున్నారు. దీంతో ప్రేమికులు పిబ్రవరి 14 న కలవాలన్న భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి..