రెండు వేల కోట్లు కాదు కేవలం రూ.80000 మాత్రమే అంటున్న టిడిపి..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో బయటపడిన ఆస్తులు వివరించారు. వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన మాజీ పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ చౌదరి దగ్గర రెండు వేల కోట్లు గుర్తించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు చంద్రబాబు ని పట్టుకుంటే ఇంకా ఎన్ని వేల కోట్లు దొరుకుతాయో అంటూ వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. దీంతో సజ్జలతో చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో టిడిపి నాయకులు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు మాజీ సీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దొరికింది కేవలం రూ. 80 వేలే అన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు… రూ.2 వేల కోట్లు దొరికాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో చాలా చోట్ల జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్నారు. కేవలం విష ప్రచారం చేస్తోందని రెండు వేల కోట్లు అంటూ వాటిలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మరియు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. అసలు శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ఆయన ఎప్పుడో చంద్రబాబు దగ్గర పనిచేయటం మానేశారని పేర్కొన్నారు.