అందుకోసమేనా చిరంజీవితో జగన్..??

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కంటే చాలా స్పీడుగా దూసుకుపోతున్నారు. అధికార పార్టీని వైసీపీని ప్రశ్నించడం లో తెలుగుదేశం పార్టీ నాయకులను మించి పోతున్నారు. ఇసుక మరియు ఇంగ్లీష్ మీడియం అలాగే తాజాగా కర్నూలు ప్రాంతంలో ఓ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కి దిమ్మతిరిగే విధంగా ప్రశ్నలు వేసి రాజకీయం స్టార్ట్ చేశారు. దీంతో అధికార పార్టీ డిఫెన్స్ లో పడటంతో పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక వ్యక్తిగత విషయాలతో విమర్శలు చేస్తు కాలం గడుపుతున్నారు.

తాజాగా…తన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ టికెట్ జగన్ ఇవ్వటానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ గా చెక్ పెట్టినట్లే అవుతుందని దానికోసం చిరంజీవికి రాజ్యసభ పదవి ఆఫర్ జగన్ ఇవ్వబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.