ఆ డైరీ గురించి భయపడి పోతున్న టీడీపీ నేతలు..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఐటీ అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను టార్గెట్ చేసి సోదాలు చేయడం జరిగింది. దాదాపు వారం రోజులకు పైగా జరిగిన ఈ సోదాల లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పనిచేసిన వ్యక్తిగత కార్యదర్శి దగ్గర కొన్ని వేల కోట్లు గుర్తించినట్లు వార్తలు మీడియాలో వినబడుతున్నాయి. అంతేకాకుండా సదరు వ్యక్తి దగ్గర ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో 2014, 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డైరీలో టీడీపీ హయాంలో ఏయే కాంట్రాక్టు సంస్థల నుంచి ఏ తేదీన ఎంత మొత్తంలో ఏయే సబ్‌ కాంట్రాక్టర్ల పేర్లతో కమీషన్‌ల రూపంలో వసూలు చేసిందీ.. వాటిని ఏయే సంస్థలకు మళ్లించిందీ.. నల్లధనాన్ని ఎలా విదేశాలకు మళ్లించిందీ.. చంద్రబాబు కుటుంబ సంస్థలకు నగదు రూపంలో వచ్చిన వివరాలు.. చంద్రబాబు, లోకేష్‌లకు నగదు రూపంలో ఇచ్చిన వివరాలు ఆ డైరీల్లో ఉన్నట్లు గుర్తించారని సమాచారం. ఏంటో ఈ డైరీ గురించి టిడిపి నాయకులు తెగ భయపడిపోతున్నారట.