జగన్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన మోడీ..??

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టడం జరిగింది. ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మోడీ మొట్టమొదటిసారిగా కలిసిన రాజకీయ నాయకుడు జగన్. దీంతో వీరిద్దరి భేటీ దేశవ్యాప్తంగా సంచలనం అయింది. దాదాపు గంటకు పైగానే మోడీ – జగన్ భేటీల చర్చలు సాగాయి.

అయితే జరిగిన ఈ భేటీలో జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా మూడు రాజధానులు, నిధుల విషయంలో సరైన సమయంలో విడుదల కాకపోవడం వంటి సమస్యలను మోడీ దృష్టికి తీసుకు వెళ్లారట. ఇదే తరుణంలో మోడీ సానుకూలంగా స్పందించారట.

అయితే దేశంలో రోజురోజుకీ బీజేపీ పార్టీపై వ్యతిరేకత వస్తున్నట్లు వార్తలు రావటం మరోపక్క మూడు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఓడిపోవడంతో బిజెపి పార్టీ పెద్దలు డైలమాలో పడ్డారు. మహారాష్ట్ర మరియు చత్తీస్ ఘడ్ అదే విధంగా తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది.

దీంతో ఇదే వేవ్ కొనసాగితే దేశంలో కాంగ్రెస్ పార్టీ కి పట్టిన గతే పడుతుందని బీజేపీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేశారట. దీంతో దేశంలోనే బలమైన రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న వైయస్ జగన్ పై దృష్టి సారించటం జరిగిందట. ఇందువల్లనే మోడీ స్వయంగా జగన్ భేటీలో దాదాపు గంటకు పైగా భవిష్యత్తు రాజకీయాలు గురించి చర్చించడం జరిగింది అంట.

వీళ్లిద్దరు భేటీలో ఎన్డీఏ తో వైసిపి పార్టీ కలిసి పనిచేయాలని చేస్తే 2 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం గ్యారెంటీ అని జగన్ కి మోడీ బంపర్ ఆఫర్ ఇవ్వటం జరిగిందట.

ముఖ్యంగా భవిష్యత్తులో రాజ్యసభలో బలం తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో మోడీ దక్షిణాదిలో ఉన్న జగన్ మరియు స్టాలిన్ లతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నట్లు జాతీయ మీడియా వర్గాల్లో వినబడుతున్న టాక్. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన భేటీలో జగన్ కి బీజేపీతో కలిసి పనిచేయాలని, మద్దతు తెలపాలని అన్ని విధాలా రాష్ట్రానికి అండగా ఉంటామని ఆఫర్ ఇచ్చారట. అయితే జగన్ మాత్రం బీజేపీతో కలిసి పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని వైసిపి పార్టీ వర్గాల్లో టాక్.