‘నా భర్త కనిపించడం లేదు’ : హార్దిక్ పటేల్ సతీమణి

వాస్తవం ప్రతినిధి: గుజరాత్ పటిదార్ ఉద్యమ నాయకుడైన హార్దిక్ పటేల్ గత 20 రోజుల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య కింజాల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తన భర్తను లక్ష్యంగా చేసుకుందని ఆమె ఆరోపించారు. “గత 20 రోజులుగా నా భర్త తప్పిపోయాడు, ఆయన ఆచూకీ గురించి మాకు సమాచారం లేదు. ఆయన కనిపించకపోవడం పట్ల మాకు తీవ్ర బాధ ఉంది.. ప్రజలు కూడా గమనించాలి’ అంటూ ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలిపారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హార్దిక్ పటేల్అభినందించారు. ఈ మేరకు ఫిబ్రవరి 11 న ట్విట్టర్‌లో తన సందేశాన్ని ఇచ్చాడు. అంతకంటే ముందు..తనను అరెస్ట్ చేసేందుకు అహ్మదాబాద్ పోలీసులు తన ఇంటికి వచ్చారని… ఆ సమయంలో తాను ఇంట్లో లేనని హార్దిక్ పటేల్ కొన్ని రోజుల క్రితం ఓ ట్వీట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు.