పవన్ గురించి అలా మాట్లాడితే సహించేది లేదు..వైసీపీ నేతలుకు జగన్ వార్నింగ్..??

వాస్తవం ప్రతినిధి: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని, ఆ తరువాత ప్రజాసేవ మీద ఉన్నటువంటి అభిమానంతో రాజకీయాల్లోకివచ్చి, ప్రజలందరితో కలిసి మమేకం అవుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత ప్రస్తుతానికి అటు రాజకీయాలతో, ఇటు సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎంత బిజ్జిగా ఉన్న ప్రజాసేవను మటుకు మరవడం లేదు పవన్. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కర్నూల్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఉదయం ఓల్డు సిటీ లోని జమ్మిచెట్టు ప్రాంతం, జోహరాపురం కాలనీ మధ్య హంద్రీ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడు రాజధానుల సంగతి తర్వాత గాని, ముందు జొహరాపురం బ్రిడ్జి లాంటి చిన్న సమస్యలని పరిష్కరించాలని, చిన్నపాటి వంతెన కూడా నిర్మించలేకపోతే ప్రభుత్వం ఉండి ఇంకెమి ప్రయోజనమని జగన్ పై ఘాటూ వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా ఈ ర్యాలీలో ముఖ్యంగా… కొందరు మృగాలా చేతిలో 2017 లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైనటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక 10వ తరగతి గిరిజన విద్యార్థిని సుగాలి ప్రీతి విషయంలో ఇప్పటికి కూడా న్యాయం జరగలేదని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఒక బాలిక పై అంతటి దారుణం జరిగితే ప్రభుత్వాలు కనీసం స్పందించకపోవడం దారుణమని పవన్ మండిపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చేసిన వాఖ్యలపై ఆగ్రహించిన వైసీపీ నేతలు కొందరు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాన్నీ బయటకు తీస్తూ పలు దూషణలు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్ పవన్ పై సీరియస్ అయిన వైసీపీ నేతలపై మండిపడ్డారని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎక్కడా ప్రస్తావన తీయొద్దని పలు మార్లు చెప్పినప్పటికీ కూడా ఇలా బహిరంగంగా వైసీపీ నేతలు మాట్లాడటంతో వారందరికీ కూడా సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారట.

దీని పై స్పందించిన పవన్ అభిమానులు..‘అమరావతి రైతుల పొట్ట కొట్టొద్దు..’ అని పవన్‌ అన్న నినదిస్తే.. ‘పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు.?’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎదురుదాడికి దిగుతారు. రాష్ట్రంలో ఇసుక సమస్య కారణంగా దాదాపు 50 మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ప్రాణాలు కోల్పోతే.. అప్పుడూ పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ ప్రస్తావనే తీసుకొచ్చారు వైసీపీ. ఉల్లిపాయల ధర పెరిగినప్పుడూ పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ ప్రస్తావనే . ఏ విషయమ్మీద పవన్‌, ప్రభుత్వాన్ని నిలదీసినా.. వైసీపీ తీరు మారడంలేదు. ఆఖరికి, కర్నూలు జిల్లాలో ఓ బాలికపై దారుణ హత్యాచారం జరిగితే, ఆ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేయడం వైఎస్సార్సీపీకి నచ్చలేదు. అంతే, పవన్‌ని విమర్శించడానికి ఇంకో ‘మాట’ ఏదీ వైసీపీ వద్ద లేదు కాబట్టి, షరామామూలుగానే పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ ప్రస్తావనను తీసుకొచ్చేశారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రిగా చేతనైతే, బాధిత కుటుంబానికి అండగా వుండాలి. నిందితులపై చర్యలు తీసుకోవాలి. ‘ఓ ఆడపిల్లకి అన్యాయం జరిగితే, న్యాయం చేయలేని ముఖ్యమంత్రి వుంటే ఎంత.? ఊడితే ఎంత.?’ అని ప్రజలు నినదిస్తోంటే, అధికార పార్టీకి దీన్నొక సవాల్‌గా తీసుకోని పనిచేయాలి..కాని వైసీపీ ఎప్పుడు మా అన్న వ్యక్తిగత వివరాల్లు తీసుకోచ్చి విమర్శిస్తునే ఉంటారు. తమ పార్టీకి జనం ఓట్లేసి గెలిపించకపోయినా, ‘మా సమస్యపై స్పందించండి..’అన్న అనగానే, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. బాధితులకు అండగా నిలబడుతుండడమే అధికార పార్టీకి అసలు నచ్చడం లేదు అని వైసీపీ పై మండిపడ్డారు పవన్ ఫ్యాన్స్.