విజయమ్మ..మహాతల్లి..ఎక్కడున్నావమ్మా..??..మీ సుపుత్రుడు కి చెప్పు తల్లి..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలని, మార్చవద్దని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు రోజు రోజుకు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ‘రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి రాజధాని అమరావతి అడ్డుకాదు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే మిగిలిన ప్రాంతాలను అభివృద్ది చేయలేం అనడం అవివేకం. జగన్మోహనరెడ్డి మొండివైఖరి వీడి పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని చెప్పాలి. అప్పటివరకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఉద్యమాన్ని ఆపది లేదు..’ అంటూ రాజధాని ప్రాంత రైతులు స్పష్టం చేశారు. 54 రోజులుగా రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సేవ్‌ అమరావతి, ఒక్క రాజధాని ముద్దు-మూడు రాజధానులు వద్దు అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు, మందడంలో, వెలగపూడిలో నిరసనలు ఉదృత్త స్ధాయిలో కొనసాగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం తదితర రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీచేసేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలన సాగుతుందని, ఏం జరిగిగా ఇక్కడినుంచి వెళ్లేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. అమ్మ.. విజయమ్మ.. మహాతల్లి.. ఎక్కడున్నావమ్మా..?? నీ పుత్రరత్నా మా కోంప ముంచుతున్నాడమ్మ. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నావు కదా తల్లి ఒక్క ఛాన్స్ ఇచ్చిందానికి మా బ్రతుకులని నడిరోడ్డు మీద పడేశాడు తల్లి మీ పుత్ర రత్న. నీకు.. నీ బిడ్దకి దండం పెడతాం తల్లి, నువ్వైన చేప్పు తల్లి..రాజధానిగా అమరావతినే కోనసాగించాలని అని అవేదన వ్యక్తం చేస్తున్నారు అమరావతి మహిళలు.