చంద్రబాబునాయుడిపై కుట్ర జరుగుతోంది: అచ్చెన్నాయుడు

వాస్తవం ప్రతినిధి:  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని, ఆయనపై బురద చల్లడానికే ఐటి దాడులు నిర్వహిస్తున్నారని టిడిపి నేత అచ్చెన్నాయుడు అన్నారు. వైసిపి ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఐటి దాడుల్లో 85 లక్షల పట్టుబడితే వేల కోట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల్లో సిబిఐ కౌంటర్‌ పిటిషన్‌పై వైసిపి నేతలు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబుపై ఎలాంటి మచ్చ లేదని ఆయన చెప్పారు.